సాక్షి, ముంబై: మహాకూటమిలో ఎమ్మెన్నెస్‌కు చోటులేదని శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఆ పార్టీని తమ కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. యువసేన పదాధికారులకు మార ్గదర్శనం చేసేందుకు అలీబాగ్‌లో ‘లక్ష్యం-2014’ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన 2000 మంది కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహాకూటమిలో ఎమ్మెన్నెస్‌ను చేర్చుకునే విషయమై స్పష్టతనిచ్చారు. ఆ పార్టీ అధినేత రాజ్‌ఠాక్రేపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శివసేన, బీజేపీ, ఆర్పీఐలు మాత్రమే మహాకూటమిగా ఉంటాయని, ఎమ్మెన్నెస్‌కు చోటు ఎంతమాత్రం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే మహాకూటమిలో ఎమ్మెన్నెస్ కూడా చేర్చుకోవాల్సిన అవసరముందని బీజేపీతోపాటు అనేకమంది ఉద్ధవ్‌పై ఒత్తిడి తెచ్చారు. అలాగే రాజ్‌ఠాక్రేను కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు.
అయితే రాజ్ మాత్రం తన వైఖరేంటో ఇప్పటిదాకా చెప్పలేదు. ఉద్ధవ్ మాత్రం రాజ్‌ను చేర్చుకునేందుకు చాలాసార్లు పరోక్షంగా సుముఖత వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాజ్ నుంచి సమాధానం రాకపోవడంతో.. రెండు చేతులు కలిస్తేనే చ ప్పట్లు మోగుతాయని ఉద్ధవ్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మహాకూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ ప్రారంభం కావడంతో బీజేపీ నేత గోపీనాథ్ ముండే...రాజ్‌ను చేర్చుకోవాలంటూ ఉద్ధవ్‌పై ఒత్తిడి మరింత పెంచారు. దీంతో.. ఎట్టి పరిస్థితుల్లో రాజ్‌ను మహాకూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసి వివాదానికి తెరదించారు. ప్రస్తుతం ఉన్న పార్టీలతోనే మహాకూటమి ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే సమావేశాలు, మార్గదర్శక శిబిరాలు, సదస్సులు వేర్వేరుగా కాకుండా మహాకూటమి నాయకులంతా కలిసి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఆర్పీఐ కూటమి తప్పకుండా విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమిలోకి ఇటీవల స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ ఎంపీ రాజు శెట్టి చేరడంతో పశ్చిమ మహారాష్ట్రలో తమ బలం మరింత పెరిగిందని ఈ సందర్భంగా ఉద్ధవ్ గుర్తుచేశారు. ఇక ఇతర పార్టీలను బతిమిలాడే అవసరం తమకు లేదని ఎమ్మెన్నెస్ పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ఉద్ధవ్ అంతటితో ఊరుకోలేదు. ఎమ్మెన్నెస్ పొత్తు లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మహాకూటమికి సాధ్యం కాదని తరచూ ముండే చేస్తున్న వ్యాఖ్యలను కూడా పరోక్షంగా తిప్పికొట్టారు. ఇక రాజ్ ఠాక్రేను భుజాలపై ఎక్కించుకోవాల్సిన అవసరం లేదని ముండే కు పరోక్షంగా చురకలంటించారు.
రాజ్ వద్దు!
Published Fri, Jan 17 2014 11:03 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement
Advertisement