నగరం.. డ్రగ్స్‌కు నిలయం!
Published Mon, Oct 7 2013 12:06 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల రవాణాకు, వినియోగానికి కూడా నగరం కేంద్రంగా మారిందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల ఎన్నారై విద్యార్థి అన్మోల్ శర్న ఒక డ్రగ్స్ పార్టీలో మరణించిన కేసు విషయమై విశ్లేషిస్తూ.. నగరంలో మాదకద్రవ్యాలు ఎంత సులభంగా లభ్యమవుతున్నాయో ఈ కేసు బహిర్గతం చేస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఐస్, ఎక్‌స్ట్రసీ పేర్లతో వ్యవహారంలో ఉన్న మెథమ్‌ఫెటామిన్ వంటి అత్యంత నాణ్యమైన పార్టీ డ్రగ్స్ తయారీలో దగ్గు మందు, మాత్రల్లో వాడే ఎఫడ్రిన్, సూడోఎఫడ్రిన్ వంటి ఉత్ప్రేరకాలను వినియోగిస్తున్నారు. అవి డెహ్రాడూన్(ఉత్తరాఖండ్), బడ్డీ,సోలాన్ (హిమాచల్‌ప్రదేశ్) లోని మందుల కంపెనీల నుంచి ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం మీదుగా మియన్మార్‌కు అక్రమంగా రవాణా అవుతున్నాయని దక్షిణ ఢిల్లీ డీసీపీ (క్రైం) బిషమ్ సింగ్ తెలిపారు.
చట్టబద్ధంగా తయారయ్యే మందుల్లో సూడోఎఫిడ్రిన్, ఎఫిడ్రిన్‌లను వాడేందుకు అవకాశముందని, డ్రగ్ తయారీదారులు వీటిని మాత్రల రూపంలో వివిధ బినామీ మందుల తయారీ కంపెనీల పేర్లతో నగరానికి దిగుమతి చేస్తున్నారని డీసీపీ తెలిపారు. అక్కడి నుంచి మణిపూర్ , మిజోరాంలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. అక్కడ వాటిని పౌడర్‌గా చేసి, మిగిలిన ఉత్ప్రేరకాలను కలిపి డ్రగ్స్‌గా మారుస్తున్నారన్నారు. అనంతరం దాన్ని మియన్మార్‌కు తరలిస్తున్నారన్నారు. తర్వాత అక్కడ నుంచి చైనా, ఇతర ఆగ్నేయ దేశాలకు పార్టీ డ్రగ్స్‌గా సరఫరా చేస్తున్నారని బిషమ్ సింగ్ తెలిపారు. ఇదిలా ఉండగా అన్మోల్ కేసులో... అతడు, అతడి నలుగురు స్నేహితులు చైనా నుంచి అక్రమంగా ఢిల్లీకి దిగుమతి అయిన ఎల్‌ఎస్‌డీ(లెజైర్జిక్ యాసిడ్ డైథిలామైడ్)ని కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు.
సాధారణంగా ఢిల్లీలోని డ్రగ్స్ పార్టీల్లో ఎల్‌ఎస్‌డీని వాడరని, కొకైన్‌ను వాడతారని తెలి పారు. ఈ కొకైన్ నైజీరియా నుంచి దిగుమతి అవుతోందన్నారు. డబ్బు సులభంగా సంపాదించేం దుకు స్మగ్లింగ్ ముఠాలతో పాటు ఉగ్రవాదులు సైతం ఈ డ్రగ్స్ అక్రమరవాణాలో పాలుపంచుకుం టున్నారని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 13 వ తేదీ రాత్రి కల్కాజీ ఏరియాలోని దక్షిణ పార్క్ అపార్ట్‌మెంట్లలో జరిగిన డ్రగ్స్‌పార్టీలో తన మిత్రులతో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న శర్న అర్ధరాత్రి తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం విది తమే. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement