ఇరుకున పెట్టడమే లక్ష్యంగా... | The goal is to suffer | Sakshi
Sakshi News home page

ఇరుకున పెట్టడమే లక్ష్యంగా...

Published Tue, Feb 3 2015 12:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఇరుకున  పెట్టడమే లక్ష్యంగా... - Sakshi

ఇరుకున పెట్టడమే లక్ష్యంగా...

బెంగళూరు : ప్రభుత్వాన్ని ఇరకున పెట్టడమే లక్ష్యంగా ప్రధాన విపక్షమైన బీజేపీ తన చర్యలను ముమ్మరం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు తెన్నులపై చర్చించేందుకు గాను బెంగళూరులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం రాత్రి ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా ఆర్కావతి డీనోటిఫికేషన్, కేపీఎస్‌సీ అధ్యక్ష సిఫారసులు, చెరుకు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, శాసనసభ పక్ష నేత జగదీష్ శెట్టర్ , కేఎస్, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement