టారిఫ్ తగ్గింపునకు పది సూత్రాలు
Published Sun, Aug 11 2013 12:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
సాక్షి, న్యూఢిల్లీ : నగరంలో ఎడాపెడా విద్యుత్ చారీ లు పెంచడాన్ని నిరసిస్తూ నగరంలోని రాంలీలామైదాన్‌లో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ‘బిజిలీ ర్యాలీ’ నిర్వహించనుంది. ఈ విషయాన్ని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ శనివారం విలేకరులకు తెలిపారు.ఢిల్లీలో విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు అనుసరించాల్సిన విధానాలపై పది సూత్రాలతో ఓ నివేదికను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వీటిని అమలు చేస్తే 30 శాతం విద్యుత్ టారిఫ్ తగ్గించవచ్చని సీఎం షీలాదీక్షిత్‌కి సవాల్ విసిరారు. ఢిల్లీలో చుక్కలనంటుతున్న విద్యుత్ చార్జీలకు కాంగ్రెస్ సర్కారే కారణమన్నారు.
బహిరంగ సభలో తాము విడుదల చేయబోయే నివేదికలోని పది అంశాలను అమలుచేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి ముందుకు రావాలని గోయల్ సవాల్ చేశారు. జేజే కాలనీల్లోని బలహీన వర్గాల వారి కోసం ప్రత్యేక సబ్సిడీపై విద్యుత్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు. ‘మేం ఇవ్వబోయే నివేదికలోని అంశాలు జనంలోకి వచ్చిన తర్వాత సైతం ముఖ్యమంత్రి వాటిని అమలు చేసేందుకు ముందుకు రాకపోతే విద్యుత్ కంపెనీలతో సీఎం కుమ్మక్కు అయ్యారన్న వాస్తవం ప్రజలకు అర్థమవుతుంది’అని గోయల్ వ్యాఖ్యానించారు. విద్యుత్‌చార్జీలను 30 శాతం వరకు తగ్గించేందుకు తమ పార్టీ నిర్ణయించిందన్నారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలనుకుంటే ఎవరైనా దీన్ని అమలుచేసే వీలుందన్నారు. విద్యుత్ పంపీణీకి సంబంధించి సైతం విద్యుత్ ప్రైవేటీకరణ అనంతరం ఎక్కువ కంపెనీలను ఆహ్వానించే వీలున్న షీలాసర్కార్ ఆ పనిచేయడం లేదని ఆరోపించారు.
మిగిలిన అన్ని అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చేసేందుకే బిజిలీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ లు నష్టాల్లో ఉన్నా ఇప్పటికీ ఎందుకు సేవలు అంది స్తున్నారని గోయల్ ప్రశ్నించారు. ఆ రంగం నుంచి ఎందుకు తప్పుకోవడం లేదని నిలదీశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీ విద్యుత్ క్రమబద్దీకర సంస్థ 300 శాతం పెంచు తు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తామని తెలిపారు. 2002 నుంచి ఇప్పటివరకు 185 శాతం మేర విద్యు త్ చార్జీలు పెంచారన్నారని, తమ పార్టీకి ఓటేసి అధికారం కట్టబెడితే విద్యుత్ రంగంలో పారదర్శకత తీసుకొస్తామని తెలిపారు. ‘తక్కువ ధరకే భారీగా విద్యుత్‌ను ఆయా కంపెనీలు కొనుగొలు చేసే అవకాశముంది.
అయినా కూడా ఆయా కంపెనీల నుం చి ఎందుకు ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నా యి. ఈ రేట్లను వినియోగదారులపై మోపుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఆర్‌డబ్ల్యూఏలు, ట్రేడర్లు,పారిశ్రామిక వర్గాల నుంచి మద్దతు లభించిందన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ ప్రతిపక్షనాయకురాలు సుష్మాస్వరాజ్, రాజ్యసభ ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ, ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కారీ, కో-ఇన్‌చార్జీ నవజ్యోత్‌సింగ్ సిద్ధు, ఢిల్లీ విధానసభ ప్రతిపక్షనాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్ర పాల్గొన నున్నారు. ఇదిలాఉండగా బీజేపీ ఆరోపణలను రాజకీయ గిమ్మిక్కులుగా షీలా కొట్టిపారేశారు.
Advertisement