హరియాణా వాసులను స్వైన్‌ఫ్లూ వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యాధి మరొకరిని బలి తీసుకుంది.
గుర్గావ్: హరియాణా వాసులను స్వైన్‌ఫ్లూ వ్యాధి బెంబేలెత్తిస్తోంది. ఈ వ్యాధి మరొకరిని బలి తీసుకుంది. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 55 ఏళ్ల మహిళ సోమవారం చనిపోయింది. ఈ నెల 14వ తేదీన సదరు మహిళ స్థానిక మేదాంత మెడిసిటీ ఆస్పత్రిలో చేరింది. కాగా ఈ వ్యాధిబారినపడి చనిపోయిన వారి సంఖ్య మొత్తం మూడుకు చేరుకుంది. ఈ విషయమై స్థానిక వైద్యుడొకరు మాట్లాడుతూ ఈ వ్యాధిబారినపడిన 12 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు.