ఐదుగురు వైద్యులకూ స్వైన్ ఫ్లూ... | 5 doctors suffereing from swine flu in hyderabad | Sakshi
Sakshi News home page

ఐదుగురు వైద్యులకూ స్వైన్ ఫ్లూ...

Published Tue, Jan 27 2015 9:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

5 doctors suffereing from swine flu in hyderabad

హైదరాబాద్: తాజా సమాచారం మేరకు స్వైన్ఫ్లూ బాధితుల జాబితాలో ఐదుగురు వైద్యులు చేరారు. జనవరి నెలలో 1050 మందికి పరీక్షలు చేయగా 366 మందికి పాజిటివ్ అని తేలింది, సోమవారం ఒక్కరోజే 52 మందికి పాజిటివ్ అని ఫలితాలు వచ్చాయి. వీరిలో 5 మంది వైద్యులుండటం గమనార్హం.

స్వైన్‌ఫ్లూ వైరస్ కారణంగా రంగారెడ్డి జిల్లాకి చెందిన ఓ మహిళ మంగళవారం మృతి చెందింది. వివరాలు... రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్‌కు చెందిన వివాహిత పూల శైలజ స్వైన్‌ఫ్లూ బారిన పడగా ఆమెను కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. గాంధీలో చికిత్స పొందుతూ శైలజ మంగళవారం ఉదయం మృతి చెందింది. శైలజ మరణంతో రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య 23కు చేరింది. సీఎంఓ కార్యాలయంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పిల్లలకు కూడా స్వైన్ఫ్లూ సోకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement