అరాచకాలకు అంతం లేదా ?
ఆడవాళ్లూ... మీకు జోహార్లు..
అవకాశాలను అందిపుచ్చుకోగల నైపుణ్యం, క్లిష్టపరిస్థితులను దాటుకుంటూ విజయాల వైపు సాగిపోగల ఆత్మసై ్థర్యం, అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎంతటి కష్టాలనైనా తట్టుకోగల ఓర్పు, తన చుట్టూ ఉన్న సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న సేవాతత్పరత ఇవన్నీ కలగలిసిన రూపమే నేటి తరం మహిళా మణులు.
మహిళా దినోత్సవం సందర్భంగా...
బెంగళూరు: బాలికలు, మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అంతులేకుండాపోతోంది. వేధింపులు, అత్యాచారాలు, వరకట్న దహనాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఫలితం లేకుండా పోతోంది. నిందితులు అదే చట్టాలను ఆసరాగా చేసుకుని బయటపడుతున్నారు. మూడు రోజుల క్రితం మైసూరులో ఓ మృగాడు ముగ్గురు మైనర్లకు నీలి చిత్రాలు చూపించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన రాష్ర్టంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పరిస్థితి ఒక్క రాచనగరికే పరిమితం కాలేదు. ఇలా రాష్ట్రంలో రోజురోజుకూ అత్యాచారాల సంఖ్య పెరుగుతోంది. మృగాళ్ల వికృత చేష్టలకు చిన్నారులూ బలవుతున్నారు. 2014 ఏడాది రాష్ట్ర హోంశాఖ గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో మొత్తం మీద 1,324 అత్యాచారాలు నమోదు కాగా అందులో బాధితుల్లో మూడింట ఒక వంతు మైనర్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని పోలీసు శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇందుకు కారణమవుతున్న వారిలో చాలా మంది దర్జాగా బయట తిరుగుతున్నారు. అత్యాచారాలకు సంబంధించి నమోదైన మొత్తం కేసుల్లో శిక్షపడిన కేసుల శాతం రెండంకెలను దాటడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
శిక్షలెక్కడ?
అత్యాచార కేసుల్లో గరిష్టంగా ఏడు శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు ఖరారవుతున్నాయి. మిగిలిన కేసులన్నీ ఏదో ఒకదశలో వీగిపోతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో బాధితులు వెనక్కు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు శాస్త్రీయ పరమైన దర్యాప్తు లోపించడం కూడా శిక్షలు తక్కువగా పడటానికి ఒక కారణమని పోలీసు అధికారులే పేర్కొంటున్నారు. మొత్తంగా కారణాలు ఏవైనా అత్యాచార కేసుల్లో శిక్షలు ఖరారైన కేసులు సంఖ్య 7 శాతానికి దాటటం లేదని గణాంకాలే వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఈ మృగాళ్ల బారిన పడిన బాధితులే కాక వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు కూడా సామాజికంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మృగాళ్లకు కఠిన శిక్షలు విధించడంలో జరిగే జాప్యం మరింత మంది బాధితులను తయారు చేస్తుందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అత్యాచార కేసులు, అందులో శిక్షపడిన వారి సంఖ్యను సంబంధించిన సమాచారం(రాష్ట్ర పోలీసుశాఖ గణాంకాలను అనుసరించి)...