న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో మూడు ప్రధానపార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇక్కడ గతంలో రెండు పధానపార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్యే అధికారం కోసం యుద్ధం జరిగేది. అయితే ఈసారి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీపార్టీ కూడా కదనరంగంలో ఉత్సాహంగా ముందడుగు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలోని 70 స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకోగా, బీజేపీ 32 స్థానాలను గెలుచుకుంది. అయితే మొట్టమొదటిసారి ఎన్నికల బరిలో దిగిన ఆప్ 28 స్థానా ల్లో అనూహ్య విజయం సాధించి అందరి అంచనాలను తారుమారుయచేసింది.
ఈ ఎన్నికల్లో గత 15 ఏళ్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాం గ్రెస్ నాయకురాలు షీలాదీక్షిత్‌ను ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ భారీ మెజారిటీతో ఓడించారు. అప్పటినుంచి ఆ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అధికారంలోకి వచ్చిన 50 రోజులకే ఢిల్లీ పీఠాన్ని వదిలిపెట్టిన ఆప్ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలపై పూర్తి దృష్టిపెట్టింది. కాగా న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రస్తు తం కేంద్ర మంత్రి అజయ్‌మాకెన్ ప్రాతినిథ్యం వహిస్తుండగా, బీజేపీ నుంచి మీనాక్షి లేఖి, ఆప్ నుంచి ఆశిష్ ఖేతన్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిస్వజీత్ పోటీ లో ఉన్నారు.
ఆ స్థానంలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లోని ఏడు స్థానాల్లో ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఇక్కడ గెలుపుపై ఆప్ ధీమా వ్యక్తం చేస్తోంది. 1996 నుంచి బీజేపీ ఖాతాలో ఉన్న ఈ స్థానాన్ని 2004లో ఆ పార్టీ అభ్యర్థి జగ్‌మోహన్‌నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాకెన్ కైవశం చేసుకున్నారు. 1996కు ముందు ఈ స్థానం నుంచి ఎల్‌కె అద్వానీ, రాజేశ్‌ఖన్నా, అటల్ బిహార్ వాజ్‌పేయి, కె.సి.పంత్ వంటి ఉద్దండులు ప్రాతి నిధ్యం వహిం చారు. ఈ నియోజకవర్గంలో పలు ప్రభుత్వ కాలనీ లు, పాతకాలం నాటి భవనాలు, మార్కెట్లు, ధనవంతుల భవంతులు, మురికివాడలు ఉన్నాయి. అయితే, హ్యాట్రిక్ గెలుపు కోసం మాకెన్ ఇప్పుడు గతం కన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది.
ఆయన ఇప్పుడు ఉదయ వ్యాహ్యాళిలో, రోడ్డుపక్కన మీటిం గులు, పాదయాత్రల ద్వారా స్థానికులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈసారి ఆయన గెలుపు నల్లేరుపై నడక కాదని విషయం సుస్పష్టం. ఆయన తన పదేళ్ల పదవీకాలంలో మురి కివాడలు, ప్రభుత్వ కాలనీవాసుల సంక్షేమానికి ఎక్కువగా శ్రద్ధ వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కాలనీలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని, తాను అధికారంలోకి వస్తే అక్కడ సరైన సదుపాయాలు కల్పిస్తానని ఆప్ అభ్యర్థి ఆశిష్ హామీ ఇస్తున్నారు.
ఏడవ పే కమిషన్ అమలు ద్వారా అధికారుల్లో ఉన్న అసమానతలను తగ్గిం చేందుకు కృషిచేస్తానన్నారు. లేఖీ సైతం సిట్టింగ్ ఎంపీ మాకెన్‌పై ‘మిస్సింగ్ ఎంపీ’ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. తనను గెలిపిస్తే మురికివాడలను బాగుచేస్తానని హామీలు గుప్పిస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గంలో 1.4 మినియన్ల ఓటర్లు ఏప్రిల్ 10న తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
‘న్యూఢిల్లీ’లో త్రికోణపోటీ
Published Fri, Apr 4 2014 10:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement