మోడీని పీఎం చేయండి
సాక్షి, ముంబై: తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ అగ్రనాయకుడు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’లో ఆయన పాల్గొన్నారు. ఆ పార్టీ నాయకులు మంగళ ప్రభాత్ లోడా, సునీల్ రాణే ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ర్యాలీలో స్థానిక తెలుగు ప్రజలు కూడా పాలుపంచుకోవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. అనంతరం పద్మశాలి సమాజ సుధారక మండలి ప్రధాన కార్యదర్శి కస్తూరి హరి ప్రసా ద్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశం ప్రగతి బాటన పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ధర్మకర్త డాక్ట ర్ చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి జిందం భాస్క ర్,తదితరులు పాల్గొన్నారు.