పారామిలటరీ దళాల రక్షణలో ఈవీఎంలు | Voting machines kept under tight security in Delhi | Sakshi
Sakshi News home page

పారామిలటరీ దళాల రక్షణలో ఈవీఎంలు

Published Thu, Dec 5 2013 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Voting machines kept under tight security in Delhi

న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం ఫలితాలు వెలువడేవరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు చెందిన ఈవీఎంలు పారామిలటరీ దళాల రక్షణలో ఉన్నాయని గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 810 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే  మొత్తం 11,993 ఈవీఎంలను 14 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చినట్లు వారు తెలిపారు.‘ మయూర్ విహార్ సమీపంలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్, కిచిడీపూర్‌లోని ఐఐటీ, వివేక్‌విహార్ లోని వివేకానంద మహిళా విద్యాలయ వంటి ప్రాంతాల్లో పారామిలటరీ దళాల రక్షణలో భద్రపర్చినట్లు వారు వివరించారు. 900 పారాట్రూపర్లను ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మోహరించినట్లు డిప్యూటీ ముఖ్య ఎన్నికల అధికారి ఎ.కె.శ్రీవాస్తవ వివరించారు.‘ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఓటింగ్ పూర్తయిన వెంటనే బుధవారం రాత్రే ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించాం..’ అని శ్రీవాస్తవ తెలిపారు. సుమారు 70 వేల మంది పోలింగ్ అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారని ఆయన వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement