రాయలసీమ సాగునీటి కోసం మరో ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధమవుతోంది.
కడప: శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు నీళ్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ వద్ద ఈనెల 29న చేయాలని తలపెట్టిన మహా ధర్నాను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమరనాథరెడ్డి చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
3వ తేదీ జరిగే మహాధర్నాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. ఈ ధర్నాకు అఖిలపక్షనేతలందరూ సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి, అంజద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.