
కోవిడ్ బాధితులను తరలించిన అనంతరం బస్‌లో శానిటైజేషన్
చెన్నై: ఇందు గలడందులేడనే సందేహము వలదు. ఎందెందు వెతికినా అందందే గలడు! అన్నట్టుగా ఉంది కోవిడ్ కేసుల తీరు. ఎవరు కరోనాను మోస్తున్నారో. ఎవరు మామూలుగా ఉన్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తాజాగా తమిళనాడులో వెలుగుచూసిన ఓ ఘటన తోటి ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేసింది. కరోనా సోకిన భార్యాభర్తలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి.. మిగతా ప్రయాణికుల గుండెల్లో దడ పుట్టించారు.
(చదవండి: కరోనాకు ఇందులో ఏది సరైన మందు?)
వివరాలు... ఇద్దరు దంపతులు కడలూరు జిల్లా నుంచి తమిళనాడులోని నెయెవెల్లికి ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. మార్గమధ్యలో వారికి వైద్యాధికారుల నుంచి ఫోన్ వచ్చింది. వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దీంతో బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సు దిగి పారిపోయారు. ఇక కరోనా సోకిన దంపతులను అంబులెన్స్‌లో కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత బస్సును పూర్తిగా శానిటైజ్ చేశారు. బస్సు ప్రయాణం కంటే ముందు రోజే వారు కరోనా పరీక్షల నిమిత్తం రక్త నమూనాలను ఇచ్చినట్టు తెలిసింది. ఫలితాలు రాకముందే వారు ప్రయాణం పెట్టుకోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు.
(చదవండి: కోర్టు గదిలో మహిళపై అత్యాచారం)
Comments
Please login to add a commentAdd a comment