సాక్షి, వెంకటాపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద ఉధృతితో పలువురు కూలీలు చిక్కుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పాలెంవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో ట్రాక్టర్‌లో వెళ్తున్న15 మంది కూలీలు వరద ఉధృతితో చిక్కుకుపోయారు.
ఈ సంఘటన జిల్లాలోని వెంకటాపురంలో చోటుచేసుకుంది. పాలెం వాగులో చిక్కుకుపోయిన 15 మంది కూలీలను తాళ్ల సహాయంతో బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రాక్టర్ నీటిలోనే ఇరుక్కుపోయింది
Comments
Please login to add a commentAdd a comment