చెట్టును ఢీ కొన్న బస్సు: 16 మందికి గాయాలు | 10 injured in road accident at medak district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న బస్సు: 16 మందికి గాయాలు

Published Wed, Jan 21 2015 11:43 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

10 injured in road accident at medak district

మెదక్: మెదక్ జిల్లా అంధోలు మండలం కిచ్చెన్నపల్లి సమీపంలోని రహదారిపై వెళ్తున్న  ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సంగరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement