-మెదక్ జిల్లాలో ఘటన
రామాయంపేట
రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన బస్సు బైపాస్‌రోడ్డువద్ద రామాయంపేట వైపు వెళుతుండగా, హైదరాబాద్ వైపు వెళుతున్న నిజామాబాద్ డిపోకు చెందిన సూపర్ డీలక్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ఉన్న 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ఈప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిలో ఎక్కువ మంది నిజామాబాద్ జిల్లాకు చెందినవారే ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బస్సులు ఢీ- 30 మందికి గాయాలు
Published Tue, Jun 28 2016 5:42 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement