10 వేల ఎకరాల పంట నష్టం | 10 thousand acres crops collapsed in karimnagar | Sakshi
Sakshi News home page

10 వేల ఎకరాల పంట నష్టం

Published Fri, Apr 24 2015 1:37 PM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

10 వేల ఎకరాల పంట నష్టం

10 వేల ఎకరాల పంట నష్టం

కరీంనగర్: కరీంనగరల్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్నవడగండ్ల వర్షాలకు పదివేల ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని ముదిమాణిక్యం, రామంచ, ఇందుర్తిలో జరిగిన పంటనష్టాన్ని గురువారం జిల్లా కలెక్టర్ నీతుకుమారీప్రసాద్ పర్యవేక్షించారు. ఆమెతో పాటు వచ్చిన వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా హుస్నాబాద్‌లో పంట నష్టపోయిన వారికి వెంటనే పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకొని ధర్నా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement