
వన్యప్రాణులకు నిలయంగా మారిన కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశం ఇప్పుడు పక్షులకూ ఆవాసంగా మారుతోంది. వన్యప్రాణుల సంరక్షణతోపాటు పక్షి జాతి సంరక్షణకు అటవీ అధికారులు కంకణం కట్టుకున్నారు. బర్డ్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఇటీవల జన్నారం అడవులకు వచ్చిన పక్షి ప్రేమికులు పలు పక్షులను గుర్తించారు.
జన్నారం(ఖానాపూర్): వన్యప్రాణులకు నిలయంగా మారిన కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశం ఇప్పుడు పక్షులకూ ఆవాసంగా మారుతోంది. వన్యప్రాణుల సంరక్షణతోపాటు పక్షి జాతి సంరక్షణకు అటవీ అధికారులు కంకణం కట్టుకున్నారు. బర్డ్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఇటీవల జన్నారం అడవులకు వచ్చిన పక్షి ప్రేమికులు పలు పక్షులను గుర్తించారు. ఈ పక్షుల విశేషాలను ఇక్కడికి అధికారులకు తెలియజేశారు. వన్యప్రాణులతోపాటు ఎఫ్‌డీవో మాధవరావు పక్షుల రకాలను గుర్తించారు. కొందరు స్టాఫ్‌కు కూడా పక్షులను గుర్తించడం పట్ల అవగాహన కల్పించారు. ఈ క్రమంలో కవ్వాల్ పులుల రక్షిత ప్రదేశంలో రెండు వందలకు పైగా పక్షి జాతులున్నట్లు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 80 వరకు పక్షుల వివరాలను సేకరించారు.
వినసొంపుగా అరుపులు
ఉదయం పూట అటవీ ప్రాంతంలోకి వెళ్తే పక్షుల కిలకిలలు గుండెను హత్తుకునేలా హాయినిస్తాయి. వినసొంపుగా వివిధ రకాల పక్షుల అరుపులు వినిపిస్తాయి. ఇటీవల టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ అడవిలో ఉదయం పర్యటించినప్పుడు పక్షులను పరిశీలించారు. హైదరాబాద్‌కు చెందిన బర్డ్స్ వాచ్ ప్రతినిధులు కవ్వాల్‌లో అరుదైన పక్షులను గుర్తించారు. ఇలాంటి పక్షులు అరుదుగా కనిపిస్తాయని, ఇవి ఇతర దేశాలలో ఉంటాయన్నారు. జన్నారం అటవీ డివిజన్‌లో కొంగలు, ఉలీ నెక్‌డ్ స్పార్క్, పిచ్చుకలు, చిలుకలు, వడ్రంగి పిట్ట, చికుముకి పిట్ట, పాలపిట్ట, వల్చర్, అడవి పావురాలు, పిచ్చుకలు, గద్దలు, కింగ్‌ఫిషర్, కోకిల, గోరింక, గువ్వలు, బ్లాక్ నెక్‌డ్, ఇలా అనేక రకాల పక్షులు కవ్వాల్ టైగర్‌జోన్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పక్షిజాతిని రక్షించడం మన బాధ్యత
మానవునికి తెలియకుండానే పక్షులు పరోక్షంగా సహకరిస్తాయి. గద్దలు, రాబంధులు మన పరిసరాలలో కళేబరాలను తిని పరోక్షంగా సహకారం అందిస్తాయి. పిచ్చుకలు, కొంగలు, మైనాలు, రైతుల పొలాల్లో కీటకాలు తింటాయి. జీవ వైవిధ్యంలో పక్షులు కూడా కీలకం. ఇలాంటి పక్షులు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. వీటిని రక్షించాల్సిన అవసరం అందరిపై ఉంది. అందుకే డివిజన్‌లో పక్షుల వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 80 వరకు పక్షి జాతులను గుర్తించాం.– మాధవరావు, ఎఫ్‌డీవో
ఇండియన్ స్పాట్ బిల్‌డ్ డక్: భారతీయ ఖండంలోని మంచినీటి వెట్టాండ్ల అంతటా వలస వెళ్లని బ్రీడ్ డక్. ఎర్రటి మచ్చ నుంచి బిల్లు అనే పేరు వచ్చింది. నీటిలో ఉన్నప్పుడు ఈ బాతును గుర్తించవచ్చు. ఒక వైపు తెల్లని చారతో విభిన్నంగా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈబాతు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అడవుల్లోని నీటి కుంటలో కనిపించింది.
యురేషియన్ వైజన్: ఈపక్షి సముద్ర తీరాల్లో కనిపిస్తుంది. ఇది 42 నుంచి 52 సెం.మీ పొడవు ఉంటుంది. బాతు జాతికి చెందిన మారెకాలోని మూడు పావురాల జాతులలో ఇది ఒకటి. మగ బాతు బూడిదరంగు పార్శా్వలతో వెనుకభాగం నల్లగా ఉంటుంది. మెడభాగం లేత ఎరుపు రంగులో ఉంటుంది. చలి కాలంలో తన సంతానోత్పత్తిని పెంపొందించడానికి ఈ ప్రాంతానికి వచ్చి వేసవిలో తన ప్రాంతానికి వెళ్తుంది.
యురేషియన్ వైజన్: ఈపక్షి సముద్ర తీరాల్లో కనిపిస్తుంది. ఇది 42 నుంచి 52 సెం.మీ పొడవు ఉంటుంది. బాతు జాతికి చెందిన మారెకాలోని మూడు పావురాల జాతులలో ఇది ఒకటి. మగ బాతు బూడిదరంగు పార్శా్వలతో వెనుకభాగం నల్లగా ఉంటుంది. మెడభాగం లేత ఎరుపు రంగులో ఉంటుంది. చలి కాలంలో తన సంతానోత్పత్తిని పెంపొందించడానికి ఈ ప్రాంతానికి వచ్చి వేసవిలో తన ప్రాంతానికి వెళ్తుంది.
ఆసియన్ ఓపెన్‌బిల్: ఈ పక్షులు కొంగలను పోలి ఉంటాయి. ఇవి 1.3 నుంచి 8 కేజీల వరకు బరువు, 81 సెం మీ పొడవు ఉంటాయి. ఇవి సౌత్ అసియాలో ఉంటాయి. ఇవి చాలా అరుదైన పక్షులు. ఇవి తెలుపు, నలుపు రంగులో ఉంటాయి. ఈ పక్షులు సైతం జన్నారం అడవుల్లో కనిపించాయి.
కామన్ టీల్ డక్: ఇది బాతు జాతికి చెందిన మరో పక్షి. ఇది ఐరోపా, ఆసియా దేశాలలో ఉంటుంది. లేత నీలి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ రంగులు తన కళ్లచుట్టూ ఉంటాయి. ఈ పక్షి అందంగా కనిపిస్తుంది. శీతాకాలంలో ఈ ప్రాంతానికి వచ్చి సంతానోత్పత్తి పెంచుకుని తిరిగి వెళుతుంది. జన్నారం అటవీ డివిజన్‌లోని బైసాన్‌కుంటలో ఈ పక్షి కనిపించగా అటవీ అధికారులు కెమెరాలో బంధించారు.