ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరంలో మార్కెట్ రోడ్డులో అక్రమంగా రేషన్ బియ్యంతో తరలిపోతున్న లారీని పక్కా సమాచారం మేరకు గురువారం సివిల్ సప్లయూస్స్, విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలంలో లోడు చేసుకోని రేషన్ బియ్యం బస్తాల నుంచి సూపర్ సంచుల్లోకి మార్చి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ రోడ్‌లోని సెంట్ మేరీ పాఠశాల సమీపంలో దాడి చేసి 128 క్వింటాళ్ల 48 కేజీలను పట్టుకున్నారు. లారీని స్వాధీనం చేసుకుని బియ్యం నిల్వలను సివిల్ సప్లయూస్ గోదాంకు తరలించారు. లారీని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఖమ్మం శివారులోని కొత్తగూడెం కేంద్రంగా బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. కొత్తగూడెనికి చెందిన నాగరాజు, అతని సోదరుడు వెంకటేశ్వర్లు, సోదురుడి కుమారుడు అనిల్, లారీ డ్రైవర్ శ్రీరామ వెంకటేశ్వర్లు ఈ దందాకు పాల్పడుతున్నారు. వీరంతా కలిసి కొణిజర్ల మండలంలోని పెద్ద గోపతి గ్రామ పోలిమేరలో లారీని ఉంచి అక్కడికి వివిధ గ్రామాల నుంచి ఆటోలు, ఇతరత్రా వాహనాల ద్వారా లారీ రేషన్ బియ్యం చేర్చుతున్నారు. లోడ్ చేసి లారీలో కోదాడకు తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. వారి నలుగురిపై కేసు నమోదు చేశారు. నాగరాజుపై గతంలో కూడా బియ్యం అక్రమ రవాణ కేసులు ఉన్నట్లు డీటీ తెలిపారు. బియ్యం లారీని పట్టుకున్న ప్రాంతానికి విజిలెన్స్ ఎస్పీ సురేందర్‌రెడ్డి సందర్శించారు. లారీ జగ్గయ్యపేటకు చెందినదని డీటీ తెలిపారు. దాడుల్లో సివిల్ సప్లయూస్ డీటీ తుంబూరి సునీల్ రెడ్డి, మిల్లర్స్ ఆర్‌ఐ రామచంద్రరావు ఉన్నారు.
కాకినాడ పోర్టు మీదుగా ఆఫ్రికాకు..!
విజిలెన్స్ ఎస్పీ సురేందర్‌రెడ్డి పేదల ప్రజల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం కొంతమంది దళారులు అక్రమ మార్గంలో తరలిస్తున్నారని, వారి సమాచారం అందించాలని విజిలెన్స్ ఎస్పీ సురేందర్‌రెడ్డి కోరారు. బియ్యూన్ని రీ సైక్లింగ్ చేసి ఇక్కడ అమ్మడంతోపాటు కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికాకు తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. పట్టుబడిన బియ్యంలారీని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టుబడిన నాగరాజు గత నాలుగేళ్లుగా బియ్యం అక్రమంగా తరలిస్తున్నాడని తెలిపారు. ఇప్పటికే నాలుగైదు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. అయినా అతనిలో మార్పు రావడంలేదన్నారు. నాగరాజుపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బియ్యూన్ని అక్రమంగా తరలించి కోదాడ ప్రాంతంలో రైసు మిల్లులో రీసైక్లింగ్ చేసి అవే బియ్యూన్ని అత్యధిక ధరలకు అమ్ముతుంటారని పేర్కొన్నారు. కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికాకు తరలిస్తున్నారనే సమాచారం ఉందని, వీటిన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కోదాడ రైస్ మిల్లుల్లో కూడా తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు.
128 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Published Fri, Jun 19 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement
Advertisement