సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ)లో అటెండర్ నుంచి ఐపీఎస్ ర్యాంకు దాకా 180 మందికి పాజిటివ్ రావడంతో సిబ్బంది, కేడెట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 20న అకాడమీలో పనిచేసే ఓ అటెండర్‌కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ఏకంగా 180 మందికి కరోనా రావడంతో ఆందోళన నెలకొంది. వీరిలో 100 మంది శిక్షణ ఎస్సైలు, 80 మంది ఇతర సిబ్బంది ఉన్నారని డైరెక్టర్ వీకే సింగ్ తెలిపారు. సగం మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. అందరికీ అకాడమీలోనే ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. బయటి నుంచి వచ్చే సిబ్బంది ద్వారానే కరోనా సోకినట్లుగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment