జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు.
జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. కోరుట్ల మండలం చిన్న మెట్పల్లిలో పిడుగు పడడంతో పొలంలో పనులు చేస్తున్న బండ్ల లింగమ్మ (39) మృతి చెందింది. మహదేవ్‌పూర్ మండలం బొమ్మాపూర్ గ్రామంలో అంబాల సంజీవ్ అనే వ్యవసాయ కూలీ పొలంలో ముందు స్ప్రే చేస్తున్న సమయంలో పిడుగు పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం పిడుగు పాటుతో మరణించిన వారి సంఖ్య నాలుగుకి చేరింది.