మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గందరగోళంగా మారింది.
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గందరగోళంగా మారింది. తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో ఇరు వర్గాల నాయకులు వాగ్వాదానికి దిగారు.
పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి మళ్లీ పార్టీలో ఎలా స్థానం కల్పిస్తారంటూ కొత్తగూడెం కార్యకర్తలు పొన్నాలను నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అరుపులు, కేకలతో సమావేశం దద్దరిల్లింది.