2గంటలూ ఉంటలేదు!
- హుదూద్ దెబ్బతో విద్యుత్ సమస్య తీవ్రం
- వ్యవసాయూనికి పెరిగిన కోతలు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాలో కరెంట్ సరఫరా పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా రెండు రోజులుగా వ్యవసాయ విద్యుత్ సరఫరా అధ్వానంగా ఉంది. రోజుకు రెండు గంటలపాటు సరఫరా కాని దుస్థితి నెలకొంది. గాలులకు తోడు ఎండల తీవ్రతతో పంట భూముల్లో తేమ వేగంగా తగ్గిపోతోంది. మెట్ట పంటలు ఎండిపోతున్నాయి. బావులు, బోర్లలో నీళ్లు ఉన్నా... కరెంట్ కోతలతో చేను తడవడం లేదు. అసలే తక్కువ విద్యుత్ ఉత్ప త్తి, ఎక్కువ అవసరం... ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ఇబ్బంది కరమైన పరిస్థితులు నెల కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ నష్టం చేసిన హుదూద్ తుపాను జిల్లాపైనా ప్రభావం చూ పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని సింహాద్రి పవర్ ప్రాజెక్ట్ నుంచి తెలంగాణకు రావాల్సిన 11 మిలియన్ యూనిట్ల విద్యుత్ నిలిచిపోయిం ది. ప్రత్యామ్నాయంగా బహిరంగ వేలంలో కరెంట్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి నా.. లాభంలేకుండా పోయిందని... దీంతో వ్యవసాయానికి కోతలను మరింత పెంచాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వ్యవసాయానికి కరెంట్ సరఫరా విషయంలో మరో రెండు రోజులు ఇదే తీరుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నారుు. డిమాండ్, సరఫరా సూత్రాల సంగతి ఏమోగానీ... చేతికి వచ్చే పంట ఎండిపోతుండడంతో జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఖరీఫ్ ఆరంభం నుంచీ అంతే...
జిల్లాలో 2.79 లక్షల వ్యవసాయ, 8.30 లక్షల గృహ విద్యుత్, 3 వేల వ్యాపార-వాణిజ్య, 9 వేల కుటీర పరిశ్రమలు, 4,800 వీధి లైట్లు, 4,350 గ్రామీణ నీటి సరఫరా, 387 భారీ పరిశ్రమలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అన్నింటికీ కలిపి రోజూ సగటున 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్న అధికారిక రికార్డులు చెబుతున్నారుు. భారీ వర్షాలు కురిసిన కొన్ని రోజులు మినహాయిస్తే జిల్లాలో ఖరీఫ్ ఆరంభం నుంచి ఎప్పుడూ డిమాండ్‌కు సరిపడా కరెంటు సరఫరా కాలేదు.
అవసరం కంటే తక్కువ కరెంటు వస్తుండడంతో విద్యుత్ పంపిణీ సంస్థ కోతలు విధించడం పరిపాటిగా మారింది. ఖరీఫ్ పంటలు చేతికి వచ్చే సీజన్ కావడంతో వ్యవసాయానికి ఐదు గంటలపాటు కరెంటు సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ ఈ నెల ఆరంభంలో నిర్ణయించింది. దీని కోసం పరిశ్రమలకు కోత విధిస్తోంది.
జిల్లాకు వచ్చే కరెంట్ సరఫరా తగ్గడంతో ఈ నెల 9 నుంచి పరిశ్రమలకు కోతలను రెండు రోజులకు పెంచింది. గృహ అవసరాలకు సైతం కోతలు పెట్టింది. వరంగల్ నగరంలోనే ప్రతి రోజు ఆరు గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడం లేదు. గ్రామాల్లో అయితే పగటి పూట కరెంట్‌అసలే ఉండడంలేదు. ఉదయం ఆరు నుంచి రాత్రి 6 గంటల వరకు పల్లెల్లో కరెంట్ రావడం లేదు. నెల రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి.
వ్యవసాయానికి ఐదు గంటలు రావడం వారం క్రితం వరకు జరిగేది. తాజాగా రెండు గంటలు వచ్చేది కష్టంగా మారింది. ఈ పరిస్థిత్లుల్లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి పొలాలకు సంబంధించి రెండు, మూడు తడులతో పంట చేతికి వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో పొలాలు ఎండిపోతుండడం రైతులకు ఆవేదిన కలిగిస్తోంది. కరెంట్ కోతలకు నిరసనగా రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. సబ్‌స్టేషన్ల వద్ద, ప్రధానరహదారులపై రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తున్నారు.