కాంగ్రెస్ పాలనలో 23వేల మంది రైతుల ఆత్మహత్య | 23 thousand people in the governance farmer suicide | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పాలనలో 23వేల మంది రైతుల ఆత్మహత్య

Published Fri, Sep 4 2015 4:37 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

23 thousand people in the governance farmer suicide

కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్
 
 హన్మకొండ అర్బన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చివరి పదేళ్ల కాంగ్రెస్ హయూంలో దేశవ్యాప్తంగా సుమారు 23,556మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కరీంనగర్ ఎంపీ, టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. ఈమేరకు రైతు ఆత్మహత్యల వివరాలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి బహరంగ లేఖరాశారు. ఆ వివరాలు గురువారం సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశంలోని రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రంలో 15.60శాతమే ఉన్నాయన్నారు. అదే కాంగ్రెస్ పాలిత 7 రాష్ట్రాల్లో 55.60 శాతం మంది రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.

ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వీటినిృదష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా బాటపట్టి ప్రచారం చేయూలనుకుంటే తమకు అభ్యంతరంలేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిందని, ఇందులో పదినెలలు అధికారులు అవస్థలు పడ్డారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పత్రిపక్షం అర్థంలేని విమర్శలకు దిగడం తగదన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, లలితయాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 కిషన్‌రెడ్డి ప్రయూస వృథా..
 ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేరుుంచి ప్రాజెక్టుల నిర్మాణానికి డిజైన్లు చేరుుస్తే..ఉప ఎన్నికల మోజులుపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని వినోద్‌కుమార్ హన్మకొండలో విలేకరుల సమావేశంలో అన్నారు. డబ్బులు దండుకునేందు ప్రాజె క్టు పనులు చేసింది ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. దేశంలోనే తొలిసారి రాడార్ పరిజ్ఞానంతో ప్రాజెక్టుల నిర్మాణం కోసం సర్వే చేయిస్తున్నామని తెలిపారు. గోదావరిలో ఇంద్రావతి నది కలిసేచోట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణరుుంచామన్నారు. అయితే కంతనపల్లికి కాస్త అటు ఇటుగా ఈప్రాజెక్టు నిర్మించే అవకాశం ఉందన్నారు.

అరుుతే, కంతనపల్లి కాకుండా దేవుని పేరిట కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చుతున్నట్లు తెలిపారు. కంతనపల్లి ప్రాజెక్టుకోసం టీఆర్‌ఎస్ 2000 లోనే ఉద్యమం చేపట్టిందని గుర్తుచేశారు. కంతనపల్లి విషయంలో బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి పాదయాత్ర చేయడం వృథా ప్రయాస అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement