రంగారెడ్డి జిల్లా కీసరలో శనివారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
కీసర: రంగారెడ్డి జిల్లా కీసరలో శనివారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రంగా గాయలు కాగా, మరో 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు.. కీసరలోని ఒక ప్రైవేట్ దుస్తుల కంపెనీలో పని చేసేందుకు ఆ సంస్థ యాజమాన్యం ఆటోలో 30 మంది మహిళలను తరలిస్తుంది. ఈ క్రమంలో ఆటో బోల్తా పడటంతో 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.