బస్సు కింద పడి చిన్నారి మృతి | 4 years old girl dies in accident | Sakshi
Sakshi News home page

బస్సు కింద పడి చిన్నారి మృతి

Dec 11 2015 2:54 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఆర్టీసీ బస్సు తగలడంతో తల్లి చేతుల్లో ఉన్న బిడ్డ బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది.

మిర్యాలగూడ అర్బన్ (నల్లగొండ) : ఆర్టీసీ బస్సు తగలడంతో తల్లి చేతుల్లో ఉన్న బిడ్డ బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ఆళ్లగడప గ్రామానికి చెందిన నాగరాజు, శ్రావణి దంపతుల కుమార్తె సాత్విక(4 నెలలు). పాప అనారోగ్యం పాలు కావటంతో ఆ దంపతులు శుక్రవారం ఉదయం మిర్యాలగూడ ఆస్పత్రికి తీసుకువచ్చారు.

వైద్య పరీక్షల అనంతరం తిరిగి వారు 2.15 గంటల సమయంలో బస్టాండు లోపలికి వెళ్తున్నారు. అదే సమయంలో బస్టాండులోకి ప్రవేశించిన ఒక బస్సు శ్రావణిని తాకింది. దీంతో ఆమె చేతుల్లో ఉన్న చిన్నారి జారి బస్సు టైర్ల కింద పడిపోయింది. బస్సు చిన్నారి మీద నుంచి వెళ్లటంతో సాత్విక అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఆ దంపతులు బోరున విలపిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement