సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో మంగళవారం ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 800 లీటర్ల నీలి కిరోసిన్ ను సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు.
ఖమ్మం (సత్తుపల్లి రూరల్) : సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో మంగళవారం ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 800 లీటర్ల నీలి కిరోసిన్‌ను సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ కేసును సత్తుపల్లి సీఐ యు.వెంకన్నబాబు సివిల్ సప్లై అధికారి డీటీ జగదీష్‌కు అప్పగించారు.
కిరోసిన్‌ను కొనుగోలు చేసి ఆటోలో అక్రమంగా తలిస్తున్న ఆటో డ్రైవర్ లంకా కల్యాణ్పై కేసు నమోదు చేసినట్లు డీటీ జగదీష్ తెలిపారు. ఆటోను సీజ్ చేసి పోలీస్టేషన్ ఆవరణలో ఉంచామని.. కిరోసిన్‌ను డీలర్ అప్పారావుకు అప్పగించినట్లు తెలిపారు.