సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు రంగంలో వైద్య, దంత కళాశాలల ఏర్పాటు విషయమై సిఫారసు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏ గోపాల్‌రెడ్డి, సభ్యులుగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్, నిమ్స్ డెరైక్టర్, వైద్య విద్యా సంచాలకులు ఉంటారు.
ఈ మేరకు కమిటీని పునర్నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ప్రైవేటు రంగంలో వైద్య, దంత, నర్సింగ్, ఎంపీహెచ్‌డబ్ల్యూ శిక్షణ సంస్థలు, పారామెడికల్ సంస్థలు, ఆయుష్ తదితర కళాశాలల ఏర్పాటుకు వచ్చే దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం అత్యవసర ధ్రువీకరణ లేదా నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీకి ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.
వైద్య కళాశాలల సిఫారసుకు ఉన్నతస్థాయి కమిటీ
Published Mon, Dec 28 2015 9:07 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM
Advertisement
Advertisement