
మాట్లాడుతున్న అబ్బయ్య
సాక్షి,ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని, గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్థి ఊకె అబ్బయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని హనుమంతుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లెందు నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందానని, తన హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు పదవులకు రాజీనామా చేసి తనతో పని చేస్తామని ప్రకటించారని ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. నాయకులు దళపతి శ్రీనివాసరాజు, రాంప్రసాద్, జక్కుల కృష్ణ, భిక్షపతి యాదవ్, భద్రూ, నామోదర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.