ఏసీబీ వలలో ఎక్సైజ్ డీసీ
రూ.25 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శివనాయక్
మరో రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ
కరీంనగర్ క్రైం : రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ ఉందనగా.. కరీంనగర్ జిల్లా ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ డి.శివనాయక్ అత్యాశకుపోరుు అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కాడు. మద్యం దుకాణం యజమాని నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటూ మంగళవారం సాయంత్రం ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాలు.. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన జూపల్లి పృథ్వీధర్‌రావు, ఆయన బంధువులకు మూడు మద్యం దుకాణాలున్నారుు.
వీటిలోని హరిణి వైన్స్ షాప్ నంబర్ 278కు పృథ్వీధర్‌రావు నామా నౌఖరిగా ఉన్నాడు. డీసీ శివనాయక్ వారికి ఫోన్ చేసి ఒక్కో దుకాణానికి రూ.10వేల చొప్పుననెలవారీ మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనంటే దుకాణాలపై దాడులు చేస్తామని బెదిరించాడు. దీంతో రూ.25వేలు ఇచ్చేందుకు పృథ్వీధర్‌రావు ఒప్పుకుని ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్న డీసీ శివనాయక్‌కు రూ.25వేలు ముట్టజెప్పాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం డబ్బులను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శివనాయక్ ఈ నెల 30న ఉద్యోగ విమరణ చేయూల్సి ఉంది.
ఆదినుంచి ఆరోపణలే..
ఎక్సైజ్ డీసీ శివనాయక్ ఉద్యోగకాలం ఈ నెల 30తో ముగియనుంది. మరో రెండు రోజుల్లో రిటైర్ కానుండగా మంగళవారం ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. ఇతడిపై ఆదినుంచి ఆరోపణలే ఉన్నాయి. 2014 జూన్ 30న డీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రతీ పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి కిందిస్థాయి సిబ్బందిని ఇష్టారాజ్యంగా వదిలిపెట్టారని పేర్కొంటున్నారు. కొద్ది నెలల క్రితం తమ సొంత ఊళ్లో హనుమాన్ ఆలయ నిర్మాణానికి చందాల రూపంలో వైన్స్‌ల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
వసూళ్లపర్వంపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితం కావడంతో వసూళ్లు నిలిచిపోయాయి. కానీ, వైన్స్ నిర్వాహకులకు మాత్రం వేధింపులు తప్పలేదు. ప్రతీ వైన్స్‌కు ఇంత అంటూ రేట్ ఫిక్స్ చేస్తారని సిబ్బంది పేర్కొంటున్నారు. రిటైర్‌మెంట్ దగ్గరపడడంతో ఈలోపు అందినకాడికి దండుకునే యత్నం చేస్తున్నట్లు సమాచారం.
మూడు నెలలుగా వైన్స్‌ల నుంచి భారీ మొత్తంలో నజరానాలు అందుకుంటున్నారని సమాచారం. మంగళవారం మధ్యాహ్నం కరీంనగర్ మద్యం డిపోను పరిశీలించారని తెలిసింది. ఎప్పుడూ డిపో వైపు వెళ్లని అతడు రిటైర్‌మెంట్‌కు రెండు రోజుల ముందు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. నజరానాల కోసమే వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి..
ఆరు నెలల్లో నలుగురు
ఎక్సైజ్ శాఖలో అవినీతి పేరుకుపోయింది. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నట్లు విమర్శలున్నాయి. ఆరు నెలల్లో నలుగురు ఎక్సైజ్ అధికారులు ఏసీబీకి చిక్కడం గమనార్హం. ఏసీబీ దాడులు చేస్తున్నా వసూళ్లపర్వం మాత్రం ఆగడం లేదు. ఎక్సైజ్‌శాఖలో కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు బెల్టు దుకాణాలు, వైన్స్‌ల నుంచి స్థాయి తగ్గట్టుగా నెలనెలా మామూళ్లు ముడుతూనే ఉంటాయి.
ఈ క్రమంలో ఓ వైన్స్ నిర్వాహకుడినుంచి లంచం తీసుకుంటూ ఏకంగా డెప్యూటీ కమిషనర్‌స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడం ఆ శాఖలో పేరుకుపోయిన అవినీతికి తార్కాణంగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మెట్‌పల్లిలో వైన్స్‌ల నుంచి ఓ సీఐ రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.
డీసీని పట్టుకున్న సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖపై గతంలోనే పలు ఆరోపణలొచ్చాయని, వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి మంగళవారం దాడి చేశామని చెప్పారు. దాడుల్లో ఏకంగా డెప్యూటీ కమిషనర్ స్థాయి చిక్కాడని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి పేరుకుపోయిందని, మరిన్ని దాడులు చేస్తామని ఆయన చెప్పడంతో ఈ శాఖలో వసూళ్ల పర్వం ఎంతలా సాగుతుందో తెలుస్తోంది.