ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఇంజినీర్
సుల్తాన్‌బజార్: కాంట్రాక్టర్ వద్ద రూ. 3 వేలు లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఇంజినీర్ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎస్‌కె చంద్రశేఖర్ కథ నం ప్రకారం... చంపాపేటకు చెందిన బిశ్వానాయక్ కాంట్రాక్టర్. రోడ్డు పను లు పూర్తి చేసిన ఇతనికి జీహెచ్‌ఎంసీ నుంచి రూ. 4 లక్షల బిల్లు రావాల్సి ఉంది.
ఈ బకాయి బిల్లు కోసం ఇతను గత జూన్ 6 నుంచి పుత్లీబౌలిలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని క్వాలి టీ కంట్రోల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జె.నర్సింగ్‌రావు చుట్టూ తిరుగుతున్నాడు. తనకు రూ. 3 వేలు లం చం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఇంజినీర్ నర్సింగ్‌రావు స్పష్టం చేశా డు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు నర్సింగ్‌రావును పట్టుకొనేందుకు పథ కం వేశారు. బిశ్వానాయక్‌కు కెమికల్ పూసి న రూ. 3 వేలు ఇచ్చి ఇంజినీర్ వద్దకు పంపగా.. ఆయన ఆ డబ్బును తన డ్రైవర్ సయ్యద్ హుస్సేన్‌ను తీసుకోమని పురమాయించాడు.
ఆ డబ్బు తీసుకున్న హుస్సేన్‌తో పాటు ఇంజినీర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నర్సింగ్‌రావు టేబుల్ డ్రాయర్‌లో ఉన్న నగదుతో పాటు అతని కారులోంచి రూ. 1.54 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీ బీ ఇన్‌స్పెక్టర్ పద్మనాగరాజు, శ్రీనివాసరావు, రాజేశ్, కాశయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యో గులు, అధికారులు లంచం అడిగితే ఫోన్ 9440446109, 9440446188 నెంబర్ల్‌కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ చంద్రశేఖర్ కోరారు.
ఇంట్లో తనిఖీలు...
సంజీవరెడ్డినగర్/మోతీనగర్: మోతీనగర్ శ్రీహర్ష అపార్ట్‌మెంట్‌లోని నర్సింగ్‌రావు నివాసంలోనూ ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి వరకూ సోదాలు చేశారు. ఇంట్లో రూ.10 లక్షల నగదుతో పాటు కూకట్‌పల్లి మెట్రో సమీపంలో 200 గజాల్లో మూడు అంతస్తుల భవనం ఉన్నట్టు గుర్తించారు. నర్సింగ్‌రావు భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. బంగారు ఆభరణాలతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను పరిశీలించాల్సి ఉందన్నారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జున్‌రెడ్డి, మంజుల ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి.