కల్తీ కల్లుకు అలవాటుపడిన వ్యక్తులు అది లభించకపోవడంతో.. అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు.
కొత్తూరు (మహబూబ్‌నగర్) : కల్తీ కల్లుకు అలవాటుపడిన వ్యక్తులు అది లభించకపోవడంతో.. అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం ఇన్మలనర్వ గ్రామానికి చెందిన శాంతమ్మ(72) అనే వృద్ధురాలు గత కొన్ని రోజులుగా కల్లు తాగుతుంది. అయితే గత వారం రోజులుగా కల్తీ కల్లు లభించకపోవడంతో.. పిచ్చి చేష్టలు చేస్తోంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది.
అలాగే దేవరకద్ర మండలం పెదరాజామూర్ గ్రామానికి చెందిన మాల చండ్రాయుడు(58) అనే వ్యక్తి కల్తీ కల్లు లభించక వికృత చేష్టలు చేస్తూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.