
కొండా మురళీధర్‌రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన నేతాజీ
సాక్షి, పరకాల రూరల్: ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు తనయుడు లింగంపల్లి నేతాజీ శుక్రవారం కాంగ్రెస్‌పార్టీలో చేరారు. హన్మకొండలోని కొండా నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. లింగంపల్లి కిషన్‌రావు టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తూ ఆగ్రోస్ చైర్మన్‌గా ఉండగా ఆయన కుమారుడు కాంగ్రెస్‌లో చేరడంతో నియోజకవర్గంలో వేగంగా సమీకరణలు మారుతున్నాయని పలువురు చర్చికుంటున్నారు. కాగా లింగంపల్లి కిషన్‌రావు స్వగ్రామం పరకాల మండలంలోని నర్సక్కపల్లి.