బంగారు తెలంగాణ కోసం | allha preyars to the invitation ministers | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించాలి

Published Fri, Jul 18 2014 5:02 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

బంగారు తెలంగాణ కోసం - Sakshi

బంగారు తెలంగాణ కోసం

స్పీకర్ సిరికొండ, డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, రాజయ్య
మద్దూరు : బంగారు తెలంగాణ కోసం ముస్లింలు అల్లాను ప్రార్థించాలని స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎంలు డాక్టర్ రాజయ్య, మహమూద్ అలీ పిలుపునిచ్చారు. మద్దూరు మండల కేంద్రంలో అయిశాబి ట్రస్ట్ చైర్మన్ ఎండీ.ఆరిఫొద్దీన్ గురువారం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు వారు హాజరయ్యూరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని అన్నారు.

కులమతాలకతీతంగా సోదర భావం తో... పేద, ధనిక బేధం లేకుండా జరుపుకునే ఏకైక పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొ న్న అనంతరం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ స్థానిక జమా మసీద్‌లో ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం గౌడ్, బొడకుంటి వెంకటేశ్వర్లు, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ మంద మాధవి, జెడ్పీటీసీ సభ్యురాలు నాచగోని పద్మ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ కోకన్వీనర్ గుజ్జ సంపత్‌రెడ్డి, జనగామ ఆర్డీఓ వెంకటరెడ్డి, రేబర్తి పీఏసీఎస్ అధ్యక్షుడు కామిడి రమేష్‌రెడ్డి, జనగామ మునిసిపల్ చెర్మైన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, బద్దిపడుగ కృష్ణారెడ్డి, మసీద్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బారి, జమాల్ షరీఫ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement