బంజారాహిల్స్ (హైదరాబాద్) : బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని కేబీఆర్ నేషనల్ పార్కులో నూతనంగా జారీ చేయనున్న వార్షిక పాస్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేబీఆర్ పార్కు అటవీ శాఖ అధికారి మోహన్ శనివారం తెలిపారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం కింద పాస్‌లు జారీ చేయనున్నట్లు వివరించారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గంట పాటు కేబీఆర్ పార్కు మెయిన్‌గేటు వద్ద దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, వయసు ధృవీకరించే పత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రవేశ రుసుం సాధారణ ప్రజలకు అయితే రూ.1,500, సీనియర్ సిటిజన్లకు(60 ఏళ్లు పైబడినవారికి) రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తును వార్షిక పాస్ పొందదలచిన వారే తీసుకురావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
'కేబీఆర్ పార్క్' పాస్‌ల జారీకి దరఖాస్తులు ఆహ్వానం
Published Sat, Jul 11 2015 6:39 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
Advertisement
Advertisement