సాక్షి, హైదరాబాద్: జిల్లా రైతు సమితుల సమన్వయకర్తల పేర్లను వ్యవసాయ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా సమన్వయకర్తగా గుండెల్లి తిరుపతిని నియమించారు. పెద్దపల్లి జిల్లాకు కోట రాంరెడ్డి, జగిత్యాలకు చీటి వెంకటరావు, సిరిసిల్లకు గడ్డం నర్సయ్య, సిద్దిపేటకు వి.నాగిరెడ్డి, మెదక్‌కు టి.సోములు, సంగారెడ్డికి వెంకటరాంరెడ్డి, ఆదిలాబాద్‌కు అడ్డి భోజిరెడ్డి, మంచిర్యాలకు ఎం.గురవయ్య, ఆసిఫాబాద్‌కు బసవత్ కార్ విశ్వనాథ్, నిర్మల్‌కు ఎస్.వెంకటరాంరెడ్డి, నిజామాబాద్‌కు బనావత్ మంజుల, కామారెడ్డికి డి.అంజిరెడ్డి, వరంగల్ అర్బన్‌కు ఇ.లలితాయాదవ్, వరంగల్ రూరల్‌కు బొల్లె భిక్షపతి, భూపాలపల్లికి పల్లా బుచ్చయ్య, మహబూబాబాద్‌కు భుక్యా బాలాజీ, జనగామకు ఐ.రమణారెడ్డి, ఖమ్మంకు నల్లమల వెంకటేశ్వర్‌రావు, కొత్తగూడెంకు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, నల్లగొండకు ఇ.రాంచందర్ నాయక్, యాదాద్రికి కొల్పుల అమరేందర్ ముదిరాజ్, సూర్యాపేటకు ఎస్.ఎ.రజాక్, మహబూబ్‌నగర్‌కు ఎస్.బస్వరాజ్‌గౌడ్, నాగర్‌కర్నూలుకు పోకల మనోహర్, గద్వాలకు కె.వెంకటరాములు, వనపర్తికి పి.జగదీశ్వర్‌రెడ్డి, రంగారెడ్డికి వంగేటి లక్ష్మారెడ్డి, వికారాబాద్‌కు కె.మహేశ్‌రెడ్డి, మేడ్చల్‌కు నారెడ్డి నందారెడ్డి నియమితులయ్యారు. సమన్వయకర్తల్లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు 14 మంది, బీసీ వర్గాలకు చెందిన వారు 10 మంది, ఎస్సీ ఇద్దరు, ఎస్టీ ముగ్గురు, ముస్లిం వర్గానికి చెందిన వారు ఒకరు ఉన్నారు.
రాష్ట్ర సమితిపై సీఎం కసరత్తు
రాష్ట్ర సమన్వయ సమితి సభ్యుల ఎంపికపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. మొత్తం 42 మందిని నియమిస్తారు. సమితిని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దానికి చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమచారం. రైతు సమితి కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం జరిగింది. రిజిస్ట్రేషన్ తర్వాత చైర్మన్‌గా గుత్తా పేరును ప్రకటిస్తారని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం ప్రకటించకపోతే రైతు సదస్సు సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం గుత్తా పేరును ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారన్న ప్రచారమూ జరుగుతోంది.
మరోవైపు రాష్ట్ర సమితిలో చోటుకోసం అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం 15 మంది పేర్లను తాత్కాలికంగా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అయ్యాక కొత్త పాలక మండలిని ఎంపిక చేసినట్లు తీర్మానం చేసి దానికి సభ్యులను, చైర్మన్‌ను నియమిస్తారని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
‘సమన్వయకర్తలు’ వీరే
Published Sat, Feb 24 2018 1:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment