‘సర్వే’త్రా అదే చర్చ.. 19న జరిగే సమగ్ర సర్వేపై ఇంటా బయట ఇదే టాపిక్. అధికారులు ఏం అడుగుతారు?, ఏం చెప్పాలి?, ఎన్నో అనుమానాలు.. ఇంకొన్ని సందేహాలు.. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేసేందుకు అధికారులే ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులు గడపగడపకూ రానున్నారు.
గ్రేటర్ పరిధిలో సమగ్ర సర్వే కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు లక్షమందిని సర్వే కోసం వినియోగిస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేషన్ బ్లాక్‌కు ఇద్దరు ఎన్యూమరేటర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్ దాదాపు 30 ఇళ్లను సర్వేచేయాల్సి ఉంటుంది. ఇలా దాదాపు 29 వేల మంది విధుల్లో పాల్గొననున్నారు. వీరికి సహాయకులుగా కళాశాలలకు చెందిన దాదాపు 70 వేల మంది విద్యార్థులను నియమించారు. దాదాపు 1,500 మంది క్లస్టర్ ఇన్‌చార్జీలుగా, 172 మంది నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా దాదాపు లక్షమంది సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొననున్నారు. ఇప్పటికే వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఆది,సోమవారాల్లో నమూనా సర్వే, 19న ఒరిజినల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం వారు ఆదివారం నుంచే విధుల్లో చేరనున్నారు.
పర్యవేక్షణ ఇలా..
గ్రేటర్‌లోని ఇళ్లను ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాక్‌కు ఇద్దరు ఎన్యూమరేటర్లను నియమించారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు సహాయకులుగా నలుగురైదుగురు అసిస్టెంట్లు ఉంటారు. డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను అసిస్టెంట్ ఎన్యూమరేటర్లుగా తీసుకున్నారు. ఎన్యూమరేటర్లకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడానికి, అత్యవసరంగా చర్యలు తీసుకునేందుకు పైస్థాయిలో నోడల్ ఆఫీసర్లు, క్లస్టర్ ఇన్‌చార్జీలుంటారు. వీరి పనితీరును అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్ల పర్యవేక్షిస్తారు. వీరితోపాటు కమిషనర్ సైతం సర్వేతీరును పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడతారు.
సర్వేకు సహకరించండి..
గ్రేటర్‌లోని ప్రజలంతా 19న ఇళ్ల వద్ద ఉండి సర్వేకు సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆది, సోమవారాలతోపాటు మంగళవారం కూడా ఎన్యూమరేటర్లు ఇళ్లకు వస్తారన్నారు.
అనుమానాలను నివృత్తి చేయండి: సీపీఐ
సాక్షి, సిటీబ్యూరో: సర్వేకు ఐదు రోజులు కేటారుయిం చాలని గ్రేటర్ హైదరాబాద్ సీపీఐ కార్యదర్శి సుధాకర్ శనివారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేపై ప్రజలు భయూందోళనలు వ్యక్తమవుతున్నా నివృత్తి చేయులేక పోతున్నారని పేర్కొన్నారు. బోగస్ రేషన్ కార్డులు ఎత్తి వేయూలన్న ప్రభుత్వ నిర్ణయుం వుంచిదే అయినా ఈ సర్వేపై ప్రజల్లో ఎన్నో అనువూనాలు నెలకొన్నాయన్నారు.
నేడు, రేపు నమూనా సర్వే..
ఆదివారం: ఎన్యూమరేటర్లు ఇంటింటికీ కరపత్రాలు, చెక్‌లిస్ట్‌లను పంపిణీ చేస్తారు. అవసరమైన సమాచారాన్ని సమకూర్చుకోవాలని సూచిస్తారు. స్టిక్కర్‌ను డోర్‌కు అంటిస్తారు. ఇంటిని సందర్శించినట్టుగా ఎన్యూమరేటర్లు ప్రీ విజిట్-1 గడిలో టిక్ చేస్తారు.
సోమవారం: ఇంటింటికీ వెళ్లి అన్నీ సమకూర్చుకున్నదీ లేనిదీ విచారిస్తారు. ఆపై ప్రీ విజిట్-2 గడిపై టిక్ చేస్తారు. సంశయాలుంటే తీరుస్తారు.
మంగళవారం: సమగ్ర సర్వే.. ఇంటింటికీ వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేస్తారు. ఆపై యజమాని సంతకాలతో కూడిన ఫారాలను స్వీకరిస్తారు.
ఆదివారం సాయంత్రం 7 వరకు ఎవరి ఇంటికైనా ఎన్యూమరేటర్లు/సహాయ ఎన్యూమరేటర్లు రాకపోతే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు (040- 21 11 11 11) ఫోన్ చేయవచ్చు. దీంతో సోమవారం సదరు ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకుంటారు.
కరపత్రాలపై, ఇళ్లకు అంటించే స్టిక్కర్‌పై ఎన్యూమరేటర్ ఫోన్ నంబరు ఉంటుంది.
సర్వేమయం
Published Sun, Aug 17 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement