సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం సాయంత్రం జరిగాయి. సీఎం సతీమణి శోభ, కూతురు ఎంపీ కవిత అందంగా పేర్చిన బతుకమ్మలను ఇంటి ముందు పెట్టి వారింట్లో పనిచేసే మహిళలతో కలసి బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడారు. అనంతరం సద్దుల వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు.