ముస్లిం రిజర్వేషన్లపై పోరాడతాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడతామని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. ముస్లిం మతపెద్దలు తమలో బీసీలున్నారని చెప్పలేదని, సీఎం కేసీఆర్ మాత్రం ముస్లింలలో బీసీలున్నారని కొత్త నిర్వచనం చెబుతున్నారని అన్నారు. ముస్లింలలో కులాలు లేవని, అటువంటిది బీసీలుగా ఎలా పేర్కొంటారన్నారు. గతంలో ఏప్రభుత్వమూ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరించలేదని, కేసీఆర్ సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తు న్నారని ధ్వజమెత్తారు.
బడ్జెట్ సమావేశాలకు నెల ముందే కాగ్ నివేదికలు పంపిణీ చేసేలా రాష్ట్రపతి, గవర్నర్, కాగ్‌లకు లేఖలు రాస్తామన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో చింతా సాంబమూర్తి, ఎస్.మల్లారెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, ఆకుల విజయతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రభుత్వం డొంకతిరుగుడు సమాధానాలతో, ప్రశ్నించిన విపక్షాలపై ఎదురుదాడితో బడ్జెట్ సమావేశాలను నిర్వహించిందని కిషన్‌రెడ్డి విమర్శించారు.