పశువృద్ధి | Cattle Calculation Complete In Adilabad | Sakshi
Sakshi News home page

పశువృద్ధి

Published Wed, Apr 17 2019 9:07 AM | Last Updated on Wed, Apr 17 2019 9:07 AM

Cattle Calculation Complete In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని పశువుల గణన ఎట్టకేలకు లెక్కతెలింది. పశుసంవర్థశాఖ అధికారులు రైతుల ఇంటింటికి వెళ్లి జిల్లాలో ని పశువుల వివరాలను వివరాలను సేకరించారు. జనాభా లెక్కల మాదిరిగానే ప్రతీ ఐదేళ్లకోసారి గణన చేపడతారు. కిందటిసారి 2012లో గణన చేపట్టారు. అనంతరం 2017లో ని ర్వహించాల్సి ఉండగా.. కేంద్రం ఒక సంవత్సరం ఆలస్యంగా ఈ ప్రక్రియను చేపట్టింది. జిల్లాలో గతేడాది అక్టోబర్‌లో పశుగణనను ప్రారంభించారు. 48 మంది సిబ్బందికి ఎన్యుమరేటర్లుగా విధులు కేటాయించారు. వీరు ఈనెలలో గణను పూర్తి చేశారు. ఈ పశుగణన వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపర్చుతున్నారు. అయితే జిల్లాలో గతం కంటే ఈసారి పశు సంపద పెరగడం గమనార్హం.

ఐదేళ్లకోసారీ..
దేశంలో తొలిసారి 1919 సంవత్సరంలో పశుగణన చేపట్టారు. అప్పటి నుంచి ఈ ప్రక్రియ ఐదేళ్ల కోసారి ప్ర క్రియ కొనసాగుతూ వస్తుంది. ప్ర స్తుతం చేపట్టింది ఇరవయ్యోది. గతంలో మాన్యువల్‌ గణన చేపట్టేవారు. అయితే నూతన సాంకేతికి పరిజ్ఞానంతో ఈసారి ట్యాబ్‌ ద్వారా పశువులను గణించారు. ఇందు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి ఎన్యుమరేటర్లు రోజువారీగా సేకరించిన పశువుల వివరాలను ఎప్పటికప్పుడుఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఓ రైతుకు ఎన్ని పశువులున్నాయి.

రైతు ఆధార్‌ నంబర్‌తోపాటు పశువులను ఫొటోలు తీసి జియో ట్యాగింగ్‌ చేశారు. అలాగే రైతులకు సంబంధించిన సాంకేతిక వ్యవసాయ పరికరాలు, మత్స్యకారుల వలలు, తెప్పలు ఇతర పరికలను అడిగి తెలుసుకుని ప్రొఫార్మాలో నమోదు చేశారు. ఆ తర్వాత పశుగణన వివరాలతోపాటు వ్యవసాయ సాంకేతిక పరికారాలను అన్‌లైన్‌లోకి ఎక్కిస్తున్నారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశుగణనవివరాలను అధికారికంగా ప్రకటించనున్నాయి.

పెరిగిన పశు సంపద..
2012లో చేపట్టిన పశుగణనలో కంటే ప్రస్తుతం నిర్వహించిన సర్వేలో పశుసంపద పెరిగినట్లు గణంకాలు చెబుతున్నాయి. 2012లో 84 వేల 497 కుటుంబాల సర్వే చేయగా, ఈసారి లక్షా 66వేల 987 కుటుంబాల్లో సర్వే చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పశు పెంపకాన్ని ప్రోత్సహించడం వల్లనే జిల్లాలో పశుసంపద పెరిగిందని తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా గతంలో 22,112 గొర్రెలుండగా, ఇప్పుడు ప్రభుత్వ ఇస్తున్న సబ్సిడీ కారణంగా వాటి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు పెరిగి 1,46,009కి చేరుకుందని భావిస్తున్నారు. కానీ, గత సర్వేలో ఒంటెలు 9 ఉండగా, ప్రస్తుతం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం!

పశుగణన సర్వే  పూర్తయింది..
జిల్లాలో పశుగణన గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించాం. ఈనెలలో ఆ సర్వే పూర్తయింది. పశువుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చుతున్నాం. ఈ గణనతో జిల్లాలో ఎన్ని పశువులున్నాయో తేలడంతో వాటికి అనుగుణంగా వాక్సినేషన్, మందులు అందుబాటులో ఉంచనున్నాం. – సురేష్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement