పంట దిగుబడి రాకపోవడంతో.. పెట్టుబడి కింద పశువులు తీసుకున్నాడని మనస్తాపం చెంది ఓ రైతు ఆత్మహత్య చేసుకోగా..
- అప్పుల బాధతో ఇద్దరు...
నెట్‌వర్క్: పంట దిగుబడి రాకపోవడంతో.. పెట్టుబడి కింద పశువులు తీసుకున్నాడని మనస్తాపం చెంది ఓ రైతు ఆత్మహత్య చేసుకోగా.. అప్పుల బాధతో మరో ఇద్దరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చెందిన కడారి దుర్గయ్య యాదవ్(45) ఏడాది క్రితం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తిమ్మాపూర్‌కు వలస వెళ్లాడు. అక్కడ 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. అయితే, వర్షాలు సరిగా కురవకపోవడంతో పత్తి సరిగా దిగుబడి రాలేదు. దీంతో దుర్గయ్యకున్న 12 పశువులను పెట్టుబడి కింద ఆసామి తీసుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో స్వగ్రామానికి వచ్చిన దుర్గయ్య శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. కొత్తకోట మండలం అమడబాకుల జీపీ పరిధి సత్యహళ్లికి చెందిన రైతు శ్రీనివాసులు(45), కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ పంచాయతీ పరిధి బల్లూనాయక్ తండాకు చెందిన రైతు లావుడ్యా బిక్షపతి(55) అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డారు.