ఇటీవల వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ పలు సూచనలు విడుదల చేసింది.
- 2015వ సంవత్సరంలో సైబరాబాద్-2, 1వ బెటాలియన్ యూసఫ్‌గూడలోని(హైదరాబాద్ జిల్లా) పిఎంటీ/పిఈటీకి హాజరైన అభ్యర్థులు ఈ నెల 8 నుంచి 10వ తారీఖు వరకు ఉదయం 10.30కు గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించిన వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలను గచ్చిబౌలి లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్లో సమర్పించాలి.
- అభ్యర్థులు అటెస్టేషన్ ఫారాలను తప్పనిసరిగా సొంత దస్తూరితో నింపాలి.
- సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థులు మెడికల్ టెస్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.
- ఏయే రోజు ఎవరెవరు హాజరు కావాలననే వివరాలు tslprb వెబ్ సైట్ లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వివరాలను చూసుకోవచ్చు.
- ఈ నెల 7వ తారీఖు ఉదయం 10గంటల నుంచి అభ్యర్థులు ఇంటిమేషన్ లెటర్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందుకోసం ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
- అభ్యర్థులు అటెస్టేషన్ ఫార్మ్ ను నింపకున్నా, సర్టిఫికెట్ పరిశీలనకు హాజరుకాకున్నా, మెడికల్ పరీక్షలో విఫలమైనా వారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారు.
కానిస్టేబుల్ పోస్టులకు సర్టిఫికేట్ల పరిశీలన
Published Mon, Mar 6 2017 10:25 PM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM
Advertisement
Advertisement