హైదరాబాద్: తెలంగాణలో పుష్కరాల కోసం వైద్య, ఆరోగ్య శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో ప్రతి ఘాట్ వద్ద 108, 104 వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 17 ఘాట్లలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వైద్య సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు.
పాలమూరు జిల్లాను గతంలో దత్తత తీసుకున్న ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు అన్యాయమే చేశారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్ట్పై చంద్రబాబు వైఖరికి నిరసనగానే టీఆర్ఎస్ బంద్కు పిలుపు నిచ్చిందని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ అంశంపై కేంద్రం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.