సాక్షి, హైదరాబాద్: ప్రతినెలా 30న జిల్లా కేంద్రాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీల ఆధ్వర్యంలోనే సివిల్ రైట్స్ డే నిర్వహించాలని పేర్కొంది. సివిల్ రైట్స్ డేని మండల, గ్రామ స్థాయిలో నిర్వహిస్తే ప్రజల సమస్యలపై యంత్రాంగానికి స్పష్టత వస్తుందని, పథకాల అమలులో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన స్వయం ఉపాధి, బ్యాంకు లింకు పథకాలపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాయితీ పథకాల లబ్ధిదారులకు సకాలంలో నిధులు మంజూరు చేయాలని, కాలయాపన చేస్తే గ్రౌండింగ్ కష్టమవుతుందన్నారు. పథకాల అమలుపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతినెలా 30న సివిల్ రైట్స్ డే
Published Sun, Apr 29 2018 1:33 AM | Last Updated on Sun, Apr 29 2018 1:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment