హైదరాబాద్: భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం భరత మాత ముద్దు బిడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. హైదరాబాద్ లోని డీఆర్డీవోలో గురువాం కలాం విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించి నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..అబ్దుల్ కలాం దేశం గర్విచదగ్గ గొప్ప వ్యక్తి అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తి కలాం అని కేసీఆర్ తెలిపారు. ఆయన చూపిన మార్గంలో అందరం ముందుకు సాగుదామన్నారు. అబ్దుల్ కలాం గొప్పమానవతావాదని తెలిపారు.