బోధన్‌లోని నిజాం దక్కన్ చక్కెర కర్మాగారం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. వేలాది మంది కార్మికులకు, రైతులకు, కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. చంద్రబాబు పుణ్యమా అని ఇపుడు ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. పాలకుల నిరాదరణకు గురవుతోంది. ఈ ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నిజాం కేటాయించిన 16వేల ఎకరాల భూములు ఏమయ్యాయో, ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలియడం లేదు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు వాటి గురించి ఆరా తీస్తున్నారు.
బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములపై రెవెన్యూ శాఖ దృష్టి సారించింది. ఇటీవల జరిగిన ఓ సమీక్ష సమావేశం లో కలెక్టర్ రొనాల్డ్ రోస్ తహసీల్‌దార్ల నుంచి ప్యాక్టరీ భూ ములపై నివేదికలు కోరినట్టు సమాచారం. ఈ మేరకు వారు భూముల వివరాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. వేల ఎకరాల సాగు భూములు పదిలంగా ఉన్నా యా, లేదా అనే అంశాలతోపాటు అమ్మకాలకు పోను, అసలు మిగిలిన భూమి ఎంత అనే వివరాలను సేకరించే పనిలో పడిపోయారు. విచిత్రమేమిటంటే రెవెన్యూ శాఖ వద్ద కూడా ఈ భూములకు సంబంధించిన సమాచారం లేదు. దీంతో అధికారులు, నిజాం షుగర్స్ ఆస్తులు, భూ ముల పరిరక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోర్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ భూముల పంపిణీ, కేటాయింపులలో గందరగో ళం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
అసలు భూములు ఎంతంటే
1938లో బోధన్‌లో నిజాం పాలకులు ఆసియా ఖండంలో నే అతి పెద్ద వ్యవసాయధారిత పరిశ్రమగా ‘నిజాం షుగ ర్స్’ను ఏర్పాటు చేశారు. దీని అభివృద్ధి కోసం చెరుకు సాగును ప్రోత్సహించేందుకు 16 వేల ఎకరాల భూముల ను కేటాయించారు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల 40 కిలోమీటర్ల పరిధిలో గల బోధన్, రెంజల్, కోటగిరి, వర్ని మండలాల పరిధిలో ఈ భూములున్నాయి. వీటి పరిధిలో 14 వ్యవసా య ఫారాలను నెలకొల్పారు. దీంతో రైతులు చెరుకును సాగుచేసి లాభాలను ఆర్జించారు. చక్కెర ఫ్యాక్టరీ కూడా లాభాలతో ముందుకు నడిచింది. ప్రపంచస్థాయిలో పేరు సంపాదించుకుంది. వేలాది మంది కార్మికులు, రైతులు, కూలీలకు జీవనాధారంగా నిలిచింది. రాష్ట్రంలో చక్కెర పరిశ్రమలూ విస్తరించాయి. కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులూ సమకూరాయి.
ఇలా కరిగిపోయింది
నిజాం పాలన అంతరించి, ప్రజాప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీ క్షీణదశ ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట్ర పాలకులు దీనిని అసలు పట్టించుకోలేదు. దీంతో కర్మాగారం నష్టాలబాట పట్టింది. దీనిని సాకుగా చూపి 1999 - 2000 నుంచి సారవంతమైన ఫ్యాక్టరీ సాగు భూములను అమ్మడం ప్రారంభించారు. అప్పటిలో అధికారంలో ఉన్న చంద్రబాబు దీనికి శ్రీకారం చుట్టారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా భూములను కొనుగోలు చేయించి దళితులు, గిరి జనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ పేదలకు ఎకరం చొప్పున కేటాయించారు. ఇందులో కూడా గందరగోళం నెలకొంది. చాలా మంది పేదలకు పలు గ్రామాలలో పట్టా లు ఇవ్వలేదు.
వారంతా ఇప్పటికీ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని గ్రామాలలో పట్టాలు ఒక చోట, భూములు మరో చోట ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేసిన పేదల భూములను కొంత మంది ధనికవర్గాలవారు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల స్థలాలు, ప్రభు త్వ విద్యా సంస్థలు, మోడల్ ఇందిరమ్మ ఇళ్ళ కాలనీలు, పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూములను కేటాయిం చారు. దీంతో ఫ్యాక్టరీ భూమి కరిగిపోయింది. ఎవరెవరికి ఎంత భూమిని కేటాయించారనేది స్పష్టంగా తెలియడం లేదు. 16 వేల ఎకరాలలో ప్రస్తుతం ఐదు లేదా ఆరువంద ల ఎకరాలకు మించి ఉండదని అంటున్నారు. గతంలో పలు ప్రజా సంఘాలు ఫ్యాక్టరీ భూముల అమ్మకాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
పరిశ్రమల పేరిట పంపిణీ
బోధన్ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే ప్రధానరహదారికి ఆనుకుని ఆచన్‌పల్లి శివారులోని విలువైన ఫ్యాక్టరీ భూమి దాదాపు తొమ్మిది ఎకరాలను ఏపీఐడీసీ ద్వారా పరిశ్ర మలకు కేటాయించారు. ఏళ్లు గడిచినా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. విలువైన భూమి మాత్రం ఆయా కంపెనీల చేతిలోనే ఉంది. 2002లో చంద్రబాబు హయాం లో నిజాం షుగర్స్‌ను ప్రయివేటీకరించారు.
దీంతో నిజాం షుగర్స్.. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ ఆస్తులు, భూముల పరరక్షణకు కోర్ కమిటీని నియమించారు. కోర్ కమిటీ హయాంలోనే విలువైన భూములు అమ్ముడుపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మకాలలో అనేక అక్రమా లు చోటు చేసుకున్నాయనే విమర్శలూ ఉన్నాయి. బోధన్ పట్టణ పరిసరాలలో కోట్ల రూపాయల విలువైన భూము లు ధనికవర్గాల చేతిలోకి వెళ్లాయని అంటున్నారు. మొత్తా నికి ఈ అంశం తేనె తుట్టెలాగా మారింది. దీన్ని కదిలిస్తే భూములు అమ్మకాలలో అక్రమాలు బహిర్గతమవుతాయని రైతు నాయకులు అంటున్నారు.
భూములెక్కడ
Published Mon, Dec 8 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM
Advertisement