
'అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి'
కరీంనగర్: తెలంగాణ ప్రాజెక్ట్ల పై వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేకరరావు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రతి పక్షాల అభిప్రాయాన్ని తెలుసుకునే సమయం కేసీఆర్కు లేదా అని మండిపడ్డారు. అహంకార పూరితంగా వ్యవహరిస్తే ప్రజలకే నష్టం అని తెలిపారు. ప్రాజెక్ట్ల పై కేసీఆర్ ప్రకటనలు గందరగోళ పరుస్తున్నాయన్నారు.