సాక్షి,నిజామాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎ ట్టకేలకు విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 65 స్థానా లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిం ది. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. బోధన్ స్థానానికి అందరూ ఊహించిన ట్లుగానే మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డి, కా మారెడ్డి స్థానం నుంచి షబ్బీర్ అలీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఆర్మూర్ స్థానాన్ని ఆకుల లలితకు కేటాయించారు. జుక్కల్ నుంచి సౌదాగర్ గంగారాం పోటీ చేయనున్నారు. బా న్సువాడ స్థానం అభ్యర్థిత్వం కాసుల బాల్‌రాజుకు దక్కింది. జిల్లాలో మొత్తం 9 స్థానాలకు గాను 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం నాలుగు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. మహా కూటమిలో భాగంగా తెలుగు దేశం పార్టీ ఆశిస్తున్న నిజామా బాద్ రూరల్, బా ల్కొండ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ప్రకటిం చలేదు.
అలాగే నిజామాబాద్ అర్బన్ స్థానానికి కూడా అభ్యర్థులెవరో తేల్చలేదు. ఎల్లారెడ్డి స్థానా న్ని తెలంగాణ జనస మితి ఆశిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ స్థానం కూడా మొదటి విడ తలో అభ్యర్థిని ఖరారు చేయలేదు.బాన్సువాడ నుంచి కాసుల బాల్ రాజుతో పాటు మల్యాద్రి రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించారు. జుక్కల్ టికెట్‌ను సౌదాగర్ గంగారాంతో పాటు అరుణతా ర కూడా ఆశించారు. మల్యాద్రి రెడ్డి, అరుణతార లకు నిరాశే ఎదురైంది. బాన్సువాడలో ఇప్పటికే అసమ్మతి రాగాన్ని ఆలపించిన మల్యాద్రి రెడ్డి రెం డు రోజుల క్రితమే తన ముఖ్య అనుచరులతో స మావేశమైన విష యం విధితమే. నిజామాబాద్ రూరల్, బాల్కొండ స్థానాలపై మహా కూటమి పొ త్తులో భాగంగా టీడీపీ కన్నేసింది. ఈ రెడింటిలో ఏదో ఒకటి ఆ పార్టీకి కేటాయించే అవకాశాలున్న ట్లు ప్రచారం జరుగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవ ర్గానికి సంబంధించి నల్లమడుగు సురేందర్‌తో పాటు సుభాష్ రెడ్డి ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment