
చెట్ల పొదల్లో పసికందు మృతదేహం
హుజూరాబాద్‌రూరల్ : ‘ఇంకా కళ్లు తెరవని ఆ పసికందు లోకా న్ని చూడకుండా నే పరలోకాలకు వెళ్లాడు. ఏ తల్లి కన్నబిడ్డో కెనా ల్‌కాలువలో విగతజీవిగా పడిఉన్నాడు. ఇంకా నెలలు కూడా నిండని ఆ పసికందు మృతదేహం కెనాల్‌కాలువలో కనబడిన తీరు స్థానికులను కలచివేసింది. మండలంలోని బోర్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో ఆదివారం అప్పుడే పుట్టిన ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు కాలువలో చేపలు పట్టడానికి వెళ్లేసరికి వారికి మగశిశువు మృతదేహం కనిపించింది. వెంటనే వారు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని శిశువు మృతదేహం గురించి ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment