ఇంజనీరింగ్‌లో 262 రకాల పేర్లతోనే డిగ్రీలు
ఏఐసీటీఈ ఉత్తర్వులపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో 262 రకాల పేర్లతోనే డిగ్రీలు ఉండాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలు వాటిని అమలు చేయాల్సిందేనని తెలిపింది. ఏఐసీటీఈ జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఏఐసీటీఈ ఆమోదం లేకుండా వివిధ పేర్లతో డిగ్రీలను ప్రదానం చేస్తుండటంతో ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. బీటెక్‌లో 45 బ్రాంచీల పరిధిలో 262 రకాల డిగ్రీలనే ప్రదానం చేయాలని స్పష్టం చేసింది. ఎంటెక్‌లోనూ 45 బ్రాంచీల పరిధిలో 594 రకాల డిగ్రీలను ప్రదానం చేయాలని వెల్లడించింది. ఆ డిగ్రీల వివరాలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది.