హైదరాబాద్: కృష్ణా నదిలో నీళ్లు లేవని మీరే చెప్పి.. ఇప్పుడు అనుమతులు లేకుండా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను ఎలా కడతారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు ప్రాజెక్టులకు కృష్ణా నది బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, ఎఫెక్ట్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. కృష్ణా నదిలో నీళ్లు లభ్యం కావడం లేదని సుప్రీంకోర్టులో మీరే (కేసీఆర్ను ఉద్దేశించి) చెప్పారు కదా అన్నారు.
ఇప్పుడు మళ్లీ 120 టీఎంసీల నీళ్ల కోసం ప్రాజెక్టులు ఎలా కడతారంటూ మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుపై సెంట్రల్ వాటర్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకులం కాదని, ఈ ప్రాజెక్టుతో నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, ప్రకాశం జిల్లా రైతులకు సాగునీరు ప్రశ్నార్థకం అవుతుందని దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణాలో నీళ్లు లేవని మీరే కదా చెప్పారు
Published Thu, Jun 11 2015 8:01 PM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement